
జోగి రాజీవ్ చేతుల మీదుగా సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రారంభం
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆదివారం రాత్రి బేతేలు చర్చి ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు, యువ నాయకులు జోగి రాజీవ్ పాల్గొన్నారు. ఆయన క్రిస్మస్ కేకును కట్ చేసి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి నల్లమోతు షా లెమ్, సంఘస్తులు నల్లమోతు మధు, నల్లమోతు ప్రకాష్, నల్లమోతు రవిబాబు, సోడగుడి కోటేశ్వరరావు, నల్లమోతు సురేష్ బాబు, లింగాల సంగీతరావు పాల్గొన్నారు.



































