
గొల్లపూడి ఏ. ఎం. సీలో రూ. 1. 50 కోట్లతో అంతర్గత రోడ్ల అభివృద్ధి.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం రూ. 1.50 కోట్లతో అంతర్గత రహదారుల అభివృద్ధికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాదు పాల్గొన్నారు. అనంతరం, గొల్లపూడి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, రైతులు విక్రయానికి తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు.
































