
వెల్వడంలో మట్టి లారీలను అడ్డుకున్న గ్రామస్తులు..
మైలవరం మండలం వెల్వడంలో అనుమతులు లేకుండా ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తున్న లారీలను ఆదివారం రాత్రి గ్రామస్తులు అడ్డుకున్నారు. రెడ్డిగూడెం మండలం నాగులూరు నుండి వెల్వడం మట్టిని తరలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అమరావతి నుండి వెల్వడం ఇటుక బట్టీలకు వస్తున్న లారీలను కూడా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా నాలుగు లారీలను పోలీస్ స్టేషన్కు తరలించారు.




































