
సీఎం చంద్రబాబు కృషితోనే భోగాపురం ఎయిర్ పోర్ట్.. ఎమ్మెల్యే
ఇబ్రహీంపట్నం(M) గుంటుపల్లిలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంగళవారం రూ. 25 లక్షల NREGS నిధులతో సిమెంట్ రహదారుల నిర్మాణానికి, రూ. 36 లక్షల 15వ ఆర్థికసంఘం నిధులతో హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో కొందరు తమను నిందించడం సరికాదని, ఆ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారని అన్నారు.




































