జిల్లాలో రౌడీ షీటర్లు, అనుమానితులకు పోలీసులు డ్రగ్ నిర్ధారణ
పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో పాజిటివ్ వస్తే కఠిన చర్యలు తప్పవనే భయంతో చాలామంది ఊళ్లు వదిలి పరారవుతున్నారు. ఏప్రిల్ 6 నుంచి ఇప్పటివరకు 3,700 మందికి
పరీక్షలు చేయగా, 950 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. మైలవరం పరిధిలో పలువురు యువత వారం రోజులుగా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల భయంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.