ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం వెలది కొత్తపాలెం గ్రామంలో ఆకస్మికంగా వాతావరణం చల్లబడి, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, వడగళ్ల వాన కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా వాహనదారులు, స్థానికులు కాసేపు ఇబ్బందులు పడ్డారు. అయితే, వడగళ్లను ఏరుకునేందుకు పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా బయటకు వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సందడి చేశారు.