గ్యాస్ ఏజెన్సీలో అవకతవకలు వార్నింగ్ ఇచ్చిన జాయింట్ కలెక్టర్

832చూసినవారు
కంచికచర్లలోని ఒక హెచ్ పీ గ్యాస్ ఏజెన్సీని బుధవారం జాయింట్ కలెక్టర్ ఇలక్కియ తనిఖీ చేశారు. గ్యాస్ బండ్లను పక్కదారి పట్టిస్తున్నట్లు గమనించినట్లు తెలిపారు. సాధారణ సమయాల్లో ఈ ఏజెన్సీని మూసివేయాలని, అయితే ప్రస్తుతం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ ఏజెన్సీకి జరిమానా, షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. మరోసారి ఇలాంటి ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్