నందిగామ: పండగపూట బాలుడు మృతి

1784చూసినవారు
నందిగామ: పండగపూట బాలుడు మృతి
నందిగామ మండలం కొండూరులో హోలీ పండుగ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. మాగల్లు జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న బెల్లంకొండ దినకరన్ (13) అనే బాలుడు స్నేహితులతో కలిసి కూచి వాగులో దిగాడు. ఈ క్రమంలో ఊపిరి ఆడక నీటిలో మునిగిపోయాడు. స్నేహితుల కేకలతో స్పందించిన గ్రామస్థులు అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్