నందిగామ: స్తంభం విరిగిపడి ఒకరి మృతి: నలుగురికి గాయాలు

1610చూసినవారు
నందిగామ: స్తంభం విరిగిపడి ఒకరి మృతి: నలుగురికి గాయాలు
నందిగామ హిందూ స్మశానవాటికలో శనివారం విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెట్లు కొడుతున్న సమయంలో స్తంభం కూలి, దాని కింద కూర్చున్న నలుగురు మహిళలు, ఒక వ్యక్తిపై పడింది. ఈ దుర్ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంత్యక్రియలకు వచ్చిన వారే ఈ ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్