నందిగామ మండలం మాగల్లు గ్రామానికి చెందిన
టీడీపీ నాయకుడు గుర్రం శ్రీనివాసరావు (55) శుక్రవారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యాభర్తల గొడవలో భాగంగా ఇద్దరూ గడ్డి మందు తాగారు. బంధువులు గుర్తించి విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందారు. ఆయన భార్య శైలజ పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనివాసరావు గ్రామంలో పురుగుమందులు, ఎరువుల దుకాణం నిర్వహించేవారు.