ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గని ఆత్కూరులో గురువారం వడదెబ్బతో కౌలు రైతు షేక్ మైసూర్ (57) మృతి చెందారు. తనకున్న పొలంతో పాటు మరికొంత కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేసిన ఆయన, పంట అమ్మకం కోసం యంత్రంతో కండెలు ఒలిపించేందుకు భార్యతో కలిసి పొలానికి వెళ్లారు. యంత్రం వద్ద కంకులు ఏరే క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై, కంచికచర్ల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. వడదెబ్బ కారణంగానే మృతి చెందినట్లు బంధువులు పేర్కొన్నారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.