నందిగామలోని హోటల్లో దుండగుల బీభత్సం

4చూసినవారు
నందిగామలోని హోటల్లో దుండగుల బీభత్సం
నందిగామలోని పాత మెజస్టిక్ హోటల్లో గత రాత్రి గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు బీభత్సం సృష్టించారు. మాస్కులు ధరించిన దుండగులు సుత్తి, గడ్డపారలతో షట్టర్ పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. లోపల గోడ కూల్చి, ఫర్నిచర్తో పాటు కొన్ని సామాన్లను ధ్వంసం చేసినట్లు వర్కర్లు తెలిపారు. హోటల్లోనే ఉన్న వర్కర్లు భయాందోళనతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్