గంపలగూడెం ఎంపీపీ శ్రీలక్ష్మికి ఘన వీడ్కోలు

2599చూసినవారు
గంపలగూడెం ఎంపీపీ శ్రీలక్ష్మికి ఘన వీడ్కోలు
గంపలగూడెం మండల పరిషత్ నిధుల నుండి ఐదు కోట్ల పైచిలుకు వివిధ ప్రజా అవసరాలకు వినియోగించినట్లు ఎంపీపీ గోగులముడి శ్రీలక్ష్మి తెలిపారు. బుధవారం గంపలగూడెం లో ఎంపీడీవో సరస్వతి అధ్యక్షతన ఎంపీపీ, పాలకవర్గానికి వీడ్కోలు సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, జడ్పిటిసి కే. శామ్యూల్, గోగులముడి కేశవరెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తన పదవీకాలంలో సహకరించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్