పెనుగొలను శివాలయ అర్చకులు దాములూరి రామలింగేశ్వర శర్మ కన్నుమూత

1395చూసినవారు
పెనుగొలను శివాలయ అర్చకులు దాములూరి రామలింగేశ్వర శర్మ కన్నుమూత
గంపలగూడెం మండలం పెనుగొలను శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు దాములూరి రామలింగేశ్వర శర్మ (65) ఆదివారం విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈనెల 15వ తేదీన వాహనం నుంచి కిందపడి తలకు గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఆలయంలో పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకున్న వారి మృతికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్