తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గురువారం పర్యటించే వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం ఖరారు చేసింది. ఉదయం 11 గంటలకు గంపలగూడెం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరుకానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు విసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి కార్యాలయంలో సమావేశానికి ఎమ్మెల్యే రానున్నారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.