పెనుగొలను శివాలయంలో దసరా చండీ హోమం వైభవం

851చూసినవారు
లోక కళ్యాణార్థం పెనుగొలను శివాలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఆదివారం చండీ హోమం వైభవంగా నిర్వహించారు. చండీ ఉపాసకులు విలాస్ పాఠక్ గణపతి, నవగ్రహాల పూజ నిర్వహించి శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి, శ్రీ మహా సరస్వతి మూల మంత్రాలు పారాయణం చేస్తూ ఆవు నెయ్యి, హోమ సామాగ్రి హోమగుండంలో సమర్పించారు. పలువురు దంపతులు హోమంలో పాల్గొన్నారు. ఈ దసరా ఉత్సవాల్లో చండీ హోమానికి విశేషమైన ప్రాధాన్యత ఉందని చండీ ఉపాసకులు తెలిపారు. ఈ కార్యక్రమం తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో జరిగింది.

సంబంధిత పోస్ట్