గంపలగూడెం: ఎంపీ తలపై పట్టువస్త్రాలు లాక్కున్న ఎమ్మెల్యే

1067చూసినవారు
గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎంపీ కేశినేని చిన్ని స్వామివారికి సమర్పించేందుకు తలపై తెచ్చిన పట్టువస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అకస్మాత్తుగా లాక్కోవడం కలకలం రేపింది. ఈ సంఘటనతో ఎంపీ చిన్ని దంపతులు సాదాసీదాగా భక్తులతో కలిసి కళ్యాణాన్ని తిలకించారు. ఈ వింత ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్