తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తమ మధ్య తలెత్తిన వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు విడివిడిగా హాజరయ్యారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఇద్దరు నేతలు కమిటీకి వివరణ ఇచ్చారు. కొలికపూడి నివేదిక రూపంలో, చిన్ని మౌఖికంగా తమ వాదనలను కమిటీకి తెలియజేశారు. ఏ సమస్య ఉన్నా పార్టీ హైకమాండ్‌కు తెలియజేయాలని ఇద్దరు నేతలకు కమిటీ సూచించింది.