గంపలగూడెం మండలం కొత్తపల్లికి చెందిన ఉప్పెల శ్రీనివాసరెడ్డి (50) అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల అనుమతితో, న్యాయవాది గోగిరెడ్డి కృష్ణారెడ్డి సమన్వయంతో విజయవాడలోని ఓ కంటి వైద్యశాల వైద్యులు మృతుడి నేత్రాలను సేకరించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.