గంపలగూడెం మండలం వినగడప గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, 80 ఏళ్ల జైశ్రీ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దివంగత సీనియర్ నాయకులు ప్రసాద్ బాబు సతీమణి అయిన ఆమె, గ్రామంలో అందరికీ మార్గదర్శకురాలిగా ఉండేవారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమెకు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. ఆమె కుమారుడు నాగమల్లేశ్వరరావు వైసీపీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు.