గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో జరుగుతున్న దసరా ఉత్సవాలలో భాగంగా ఆదివారం రాజ్యలక్ష్మి అమ్మవారిని విజయలక్ష్మిగా అలంకరించారు. ఆలయ అర్చకులు గోపాలాచార్యులు అమ్మవారిని పుష్పాలు, పట్టువస్త్రాలతో అలంకరించి అష్టోత్తరం, విష్ణు సహస్రనామాలు పఠించారు. స్థానిక మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు. బీసీ కాలనీలో వేదాంతం రామకృష్ణశాస్త్రి అమ్మవారిని చండీదేవిగా అలంకరించి కుంకుమ పూజ నిర్వహించారు.