గత నెలలో మరణించిన అనూష అనే వివాహిత మృతదేహాన్ని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేల హిందూ శ్మశానవాటికలో మంగళవారం వెలికితీసి పంచనామా నిర్వహించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న అనూష, రవివర్మల ప్రేమ వివాహం అనంతరం అనూష గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవ సమయంలో మృతి చెందింది. ఆమె సోదరి అనుమానం వ్యక్తం చేయడంతో హైదరాబాద్ పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యులు మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.