విజయవాడలోని ముసాఫిర్ ఖానా ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం రాత్రి వివాహం జరుగుతుండగా, హాల్‌లోని సీలింగ్ ఒక్కసారిగా ఊడి కిందపడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో పెళ్లికి వచ్చిన అతిథులు ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను విషాదం తప్పింది. భారీ శబ్దంతో సీలింగ్ కూలిపోవడంతో భయాందోళనలకు గురైన జనం పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.