విజయవాడ శివారు రామవరప్పాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా కోళ్ల పందేల కోసం భారీగా బరులను హైటెక్ హంగులతో సిద్ధం చేశారు. ఇతర జిల్లాల నుంచి పందెగాళ్లను రప్పించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పందేలలో కోట్ల రూపాయల నగదు చేతులు మారే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ క్రీడకు అధికారులు వెంటనే అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.