కాల్ మాట్లాడతానని.. రూ. 7 లక్షలు కాజేశాడు

1379చూసినవారు
కాల్ మాట్లాడతానని.. రూ. 7 లక్షలు కాజేశాడు
విజయవాడలో ఓ దుండగుడు ఫోన్ తీసుకుని రూ. 7 లక్షల నగదును దొంగిలించిన ఘటన కలకలం రేపింది. బాధితుడు కుమార్, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. గుర్తుతెలియని వ్యక్తి క్రెడిట్ కార్డ్ కంపెనీ ప్రతినిధిగా చెప్పుకుని ఫోన్ అడిగాడు. కుమార్ ఫోన్ ఇవ్వగానే, అందులోంచి రూ. 7 లక్షలు విడతల వారీగా బదిలీ చేసుకున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.