మాజీ మంత్రి దేవినేని ఉమా శనివారం విజయవాడలో గొల్లపూడిలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ నేషనల్ మీడియా చానల్స్ కనపడగానే జగన్మోహన్ రెడ్డిలోని అపరిచితుడు బయటకు వస్తారని అన్నారు. సజ్జల సలహాలు తీసుకున్నా జగన్‌రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడని ఎద్దేవా చేశారు. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వస్తుందని తెలిసి నోటికి హద్దు అదుపు లేకుండా విషం చిమ్మాడని విమర్శించారు.