శనివారం అర్ధరాత్రి మధురానగర్ ట్రాఫిక్ పాయింట్ సమీపంలో ఏడు అడుగుల కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని, కొండచిలువను పట్టుకుని నగరానికి దూరంగా ఏలూరు కాల్వలో వదిలిపెట్టారు. కొండ ప్రాంతాల నుంచి ఇది వచ్చి ఉండవచ్చని, కొండప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.