విజయవాడ: మోసం, బెదిరింపులకు పాల్పడుతున్న ఓ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మాచినేని కోటేశ్వరరావును పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. 2014 నుంచి రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజల వద్ద నగదు తీసుకొని, ప్లాట్లు ఇప్పిస్తానని మోసం చేసి, బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే 10 కేసులు నమోదయ్యాయని, 50 మందికి పైగా బాధితులు ఉన్నారని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు శనివారం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.