విజయవాడలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుణదల మేరీ మాత ఆలయం సమీపంలో మలుపు వద్ద, రామవరపాడు వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే మాచవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.