విజయవాడలో భారీ పైవంతెన నిర్మాణానికి అడుగులు

1440చూసినవారు
విజయవాడలో భారీ పైవంతెన నిర్మాణానికి అడుగులు
విజయవాడ-హైదరాబాద్ ఎన్హెచ్-65 ఆరు వరుసల విస్తరణలో భాగంగా, నగర పరిధిలో గొల్లపూడి నుంచి కనకదుర్గ వారధి వరకు 5 కి. మీ. భారీ పైవంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణం సులభతరం అవుతుంది. ప్రస్తుత రహదారి సర్వీస్ రోడ్డుగా మారుతుంది. పీఏటీఎస్సీ పరిశీలనలో ఉన్న ఈ డీపీఆర్కు ఆమోదం లభిస్తే, 2026 ఏప్రిల్లో పనులు మొదలయ్యే అవకాశం ఉంది.