పోరంకిలో ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి

894చూసినవారు
విజయవాడలోని పోరంకిలో గల ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న పవన్ అనే విద్యార్థి శనివారం రాత్రి హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్టడీ అవర్కు వెళ్లకుండా గదిలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కళాశాల యాజమాన్యం చెబుతోంది. అయితే, గతంలో తోటి విద్యార్థులు దాడి చేశారని, దీనిపై ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశామని మృతుడి తండ్రి ఆరోపిస్తున్నారు. కుమారుడి మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్