విజయవాడ: కూతురి ఇంటికి వెళ్లి వస్తుండగా తీవ్ర విషాదం..!

973చూసినవారు
విజయవాడ: కూతురి ఇంటికి వెళ్లి వస్తుండగా తీవ్ర విషాదం..!
విజయవాడ వెస్ట్ బైపాస్ పై మంగళగిరి సమీపంలో రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన విషయం తెలిసిందే. కుమార్తె ఇంటి నుంచి తిరుగు ప్రయాణంలో బైపాస్లో దారి తప్పారు. తిరిగి వస్తుండగా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తలలకు తీవ్ర గాయాలే కారణమని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశారు. కొత్త బైపాస్ వద్ద సూచిక బోర్డుల లేమి వల్ల వాహనదారులు అయోమయానికి గురవుతున్నారని స్థానికులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్