విజయవాడ: రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి.. అవయవదానం!

1389చూసినవారు
విజయవాడ మాచవరంలో ఈ నెల 25న జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నసీరుద్దీన్ బుధవారం మృతి చెందడంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య రెండుకు చేరింది. విషాదంలోనూ నసీరుద్దీన్ కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకుంటూ అతని అవయవాలను దానం చేశారు. ఈ అవయవాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మాచవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్