సురాయిపాలెంలోని పొలాల్లో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పొలాల్లో వ్యక్తి కూలిపోయిన స్థితిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భవానిపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా, మృతుడి వయసు సుమారు 40-45 ఏళ్లు ఉండవచ్చని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.