విజయవాడ - గన్నవరం జాతీయ రహదారిపై గూడవల్లి వద్ద శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని సుమారు 30-35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని గుర్తించగలవారు పటమట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ పవన్ కిషోర్ కోరారు. ఈ ఘటనపై పటమట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.