ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని, తానే ఏసీబీ అధికారిని అని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న జయకృష్ణ అనే నకిలీ అధికారిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురానికి చెందిన జయకృష్ణ, పలువురు అధికారులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో తేలింది. అతను ఎస్సై సెలక్షన్లకు కూడా వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.