విజయవాడ లబ్బీపేటలోని మలబార్ గోల్డ్ దుకాణం వద్ద ఒడిశాకు చెందిన ఓ యువకుడు గంజాయి మత్తులో హడావుడి చేశాడు. షాపు మెట్ల వద్ద పడుకొని గొడవ చేస్తున్న అతడిని సిబ్బంది మందలించగా, వారిపైనే తిరగబడ్డాడు. దీంతో సిబ్బంది, స్థానికులు కలిసి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సదరు యువకుడు తాడిగడపలో నివాసం ఉంటున్నట్లు దుకాణ నిర్వాహకులు తెలిపారు.