APK ఫైల్ పై క్లిక్.. రూ. 9 లక్షలు స్వాహా !

895చూసినవారు
APK ఫైల్ పై క్లిక్.. రూ. 9 లక్షలు స్వాహా !
విజయవాడలో మరోసారి సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. జయప్రకాశ్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు ఆన్‌లైన్ మోసానికి గురై రూ.9 లక్షలు కోల్పోయారు. ఆయన మొబైల్‌కు వచ్చిన APK ఫైల్‌ను వైరస్ తొలగింపు కోసం అనుకొని ఓపెన్ చేయడంతో ఈ ఘటన జరిగింది. అనంతరం పలుమార్లు OTP సందేశాలు రావడంతో బ్యాంక్ అకౌంట్ చెక్ చేయగా నగదు మాయమైనట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్