విజయవాడ నగర శివారులోని గుణదల ప్రాంతంలో శనివారం డ్రగ్స్ కలకలం రేగింది. సాయి అనే యువకుడి వద్ద నుంచి 13 గ్రాముల MDMA మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నున్న సీఐ కృష్ణమోహన్ తెలిపారు. బెంగళూరు నుంచి MDMA కొనుగోలు చేసి విజయవాడలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.