తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పెరిగిన మున్నేరు వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయం నుంచి పెరిగిన ప్రవాహం శుక్రవారం తెల్లవారుజాము నుంచి తగ్గడంతో, రెండు రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు పునరుద్ధరణకు అవకాశం ఏర్పడింది. 24 గంటల తర్వాత వరద ఉద్ధృతి తగ్గడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు, అధికారులు కొంతమేర ఉపశమనం పొందారు.