విజయవాడలో హవాలా డబ్బు.. రూ.2 కోట్ల సీజ్

1217చూసినవారు
విజయవాడలో హవాలా డబ్బు.. రూ.2 కోట్ల సీజ్
నగరంలోని గుణదల ప్రాంతంలో హవాలా డబ్బు కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. సుమారు రూ.2 కోట్లకు పైగా నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ డబ్బును ఒడిశా రాష్ట్రం నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా ఈ హవాలా డబ్బు బయటపడింది. వెంటనే నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బు తరలించడానికి ఉపయోగించిన కారును కూడా సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న నగదును తదుపరి విచారణ కోసం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. హవాలా నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

సంబంధిత పోస్ట్