రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్.. ఈసారైన నోరు విప్పుతారా?

814చూసినవారు
రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్.. ఈసారైన నోరు విప్పుతారా?
విజయవాడ నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, సోదరుడు రాములులను సిట్ అధికారులు శుక్రవారం మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వీరిని విచారించనున్నారు. గతంలో ఇబ్రహీంపట్నంలో జరిగిన నకిలీ మద్యం తయారీ కేసులో వీరిని సిట్ విచారించింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిని ఈ కేసులో పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. మరోవైపు, జోగి కుటుంబానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జోగి భార్య, కుమారులకు 41ఏ నోటీసులు అందాయి. జోగి రమేష్ అరెస్ట్ సమయంలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేసి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదైంది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ ఈ నెల 16 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.