నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములులను సిట్ అధికారులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వీరిని విచారించనున్నారు. గతంలో ఇబ్రహీంపట్నంలో జరిగిన నకిలీ మద్యం తయారీ కేసులో జోగి సోదరులను సిట్ విచారించింది. ప్రస్తుతం వీరిద్దరూ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జోగి కుటుంబానికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. జోగి భార్య, కుమారులకు కూడా నోటీసులు అందాయి. గతంలో జోగి రమేష్ అరెస్ట్ సమయంలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేసి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కేసు కూడా నమోదైంది.