విజయవాడలో ఆకట్టుకున్న కరాటే కిడ్స్

1262చూసినవారు
విజయవాడ పైపుల రోడ్డు జంక్షన్ వద్ద శనివారం ట్రాఫిక్ పోలీసులు ఒక వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ కిషోర్ బాబు, ఎస్సై కృష్ణల ఆధ్వర్యంలో కరాటే స్కూల్ విద్యార్థులు వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రాముఖ్యతను, ప్రయోజనాలను వివరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించి, ప్రమాద రహిత ప్రయాణానికి సహకరించాలని పోలీసులు కోరారు. ఈ పోలీసుల వినూత్న ప్రయత్నం ప్రజలను ఆకట్టుకుంది.