భారీగా రేషన్ బియ్యం స్వాధీనం

260చూసినవారు
భారీగా రేషన్ బియ్యం స్వాధీనం
విజయవాడ శివారు గంగూరులో అధికారులు భారీగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంగూరులోని ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచిన 2,000 నుంచి 2,500 బ్యాగుల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. కాకర్ల సాయి మోహన్ నాయుడు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇతను విజయవాడకు చెందిన పలువురి వద్ద రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్