విజయవాడ పటమటలోని సోనో విజన్ లో అర్ధరాత్రి దొంగలు చొరబడి సుమారు 19 లక్షల రూపాయల విలువైన ఫోన్లను దోచుకెళ్లారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ఈ దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిఘా పెరగడంతో ఆంధ్రప్రదేశ్ ను అడ్డాగా మార్చుకున్నారని భావిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు 4 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.