ఎన్టీఆర్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి కోటుమల్ల నాగవీరన రేంద్ర (36) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గత నెల 31న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా, పాముల కాల్వ వద్ద వేగ నిరోధకం వద్ద ప్రమాదవశాత్తు వాహనం పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు శవ పంచనామా, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.