పటమట: మృత్యువుతో పోరాడి ఓడిన రెండేళ్ల చిన్నారి

1చూసినవారు
పటమట: మృత్యువుతో పోరాడి ఓడిన రెండేళ్ల చిన్నారి
గుంటూరులో జ్వరంతో నాలుగు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన రెండేళ్ల దేవ అన్షిక, డిశ్ఛార్జి అయిన కొద్దిసేపటికే బస్సు ఢీకొని మృతి చెందింది. శనివారం మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద యూటర్న్ తీసుకునే సమయంలో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి తలకు తీవ్ర గాయాలవ్వడంతో మృతి చెందింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

సంబంధిత పోస్ట్