విజయవాడలోని నాలుగు స్తంభాల సెంటర్ వద్ద మంగళవారం రాత్రి టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో టీడీపీ 39వ డివిజన్ అధ్యక్షుడు శివ శర్మ, చైతన్య గాయపడ్డారు. వీరిని స్థానికులు వెంటనే భవానిపురంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న బుధవారం పరామర్శించారు.