విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భవానిపురం పరిధిలో బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు చింతాడ దుర్గారావుకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.4,000ల జరిమానా విధించింది. బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం అందేలా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఆదేశాలు జారీ అయ్యాయి.